02-02-2026 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నానక్మ్‌గ్రూడలో స్టార్ క్యాన్సర్ సెంటర్ (స్టార్ హాస్పిటల్స్), ‘ఫిట్ ఇండి యా’,‘హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్’ సహకారంతో ‘స్టార్ సైక్లోథాన్ క్యాన్సర్ అవేర్‌నెస్ రైడ్ 2026’ ను ఘనంగా నిర్వహిం చింది. దాదాపు 1,000 మంది సైక్లిస్టులు పాల్గొన్న ఈ 10 కిలోమీటర్ల ర్యాలీ, ఒక సా మాజిక లక్ష్యం కోసం తెలంగాణలో జరిగిన అతిపెద్ద సైక్లింగ్ కార్యక్రమంగా రికార్డు సృ ష్టించింది.
వైద్య నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు, విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు కలిసి క్యాన్సర్ పట్ల ఉన్న భయా న్ని పోగొట్టి, ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరిం చారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సాయినాథ్ భేతనభొట్ల మాట్లాడుతూ, ముందస్తు స్క్రీనింగ్ కీలక ప్రాముఖ్యతను వివరించారు. దురదృష్టవశాత్తు, అధిక ఇన్సిడెన్స్ రేట్ల కారణంగా హైదరాబాద్ ‘బ్రెస్ట్ క్యాన్సర్ రాజధాని’ అనే ట్యాగ్‌ను కలిగి ఉంది.
ఇతర క్యాన్సర్లలో కూడా పెరుగుదలను చూస్తున్నాం. వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి.. కాబట్టి ప్రజ లు స్క్రీనింగ్ కోసం ముందుకు రావాలి. ప్రాణాలను కాపాడటానికి ముందస్తు గుర్తిం పే అత్యంత ప్రభావవంతమైన సాధనం, అని తెలిపారు. స్టార్ హాస్పిటల్ సర్జికల్ ఆం కాలజీ సీనియర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ విపి న్ గోయల్ రోబోటిక్ సర్జరీ పరివర్తనాత్మ క పాత్రపై తన అభిప్రాయాలను పంచు కున్నారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ స్టార్ క్యాన్సర్ సెంటర్ క్లినికల్ నైపుణ్యాన్ని వివరించారు.
స్టార్ క్యాన్సర్ సెంటర్‌లో ప్రతి రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ‘ఆర్గన్-స్పెసిఫిక్’ క్యాన్సర్ కేర్ ప్రో గ్రామ్‌లను అందిస్తున్నాం. క్యాన్సర్ చికిత్స అనేది రోగులు, కుటుంబ సభ్యులు, వైద్యు లు కలిసి చేసే ప్రయాణం. ప్రతి దశలో రోగులకు మద్దతు ఇవ్వడానికి మా బృందం అంకితభావంతో సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రయాణం అవగాహన, సకాలంలో స్క్రీనింగ్తోనే ప్రారంభమవుతుంది అని తెలిపారు.