కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను ఆదుకుంటుంది
కే జైపాల్ రెడ్డి...
మునగాల: కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను ఆదుకుంటుంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి(Congress Party President Koppula Jaipal Reddy) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నారాయణ గూడెం గ్రామ శాఖ నూతన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన 17 నెలల కాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డిల సారధ్యంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులతో అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాన్ని మరొకవైపు పరుగులు పెట్టిస్తుందని, కావున క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా నారాయణ గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అన్నం గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పల్లె సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గడ్డం లింగరాజు, కుంభజడ నాగేశ్వరరావు, గోపిరెడ్డి సైదిరెడ్డి కార్యదర్శులుగా కాసాని లింగయ్య, మిట్టగనుపుల మధుసూదన్, లంజేపల్లి జోజయ్య, కోశాధికారిగా మిట్టగనుపుల రామయ్య తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు.






