22 June, 2026 | 6:07 PM

ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం...

22-06-2026 05:06 PM

కౌన్సిలర్ ఉట్లా వరప్రదీప్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 7వ వార్డులో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఏడవ వార్డు వార్డ్ కౌన్సిలర్ ఉట్లా వరప్రదీప్ తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహాయ సహకారాలతో, మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, కమిషనర్ రమేష్ ఆదేశాల మేరకు వార్డులో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. వార్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కొత్త విద్యుత్ మీటర్ల కనెక్షన్లు, ప్రజల తాగునీటి అవసరాల కోసం నల్లా కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసినట్లు తెలిపారు.

గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఉట్లా వరప్రదీప్ తెలిపారు. వార్డు ప్రజలు అభివృద్ధి పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ ఈశ్వర్ కి స్థానిక కౌన్సిలర్ వరాప్రదీప్  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వర ప్రదీప్  కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు,