17-01-2026 05:53:13 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించిన చైర్మన్ తో పాటు వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు అయ్యాయని ఆయా వార్డుల్లో పార్టీ కోసం కష్టపడి పని చేస్తే వారికి తప్పకుండా పెద్దల సహకారంతో టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు నిర్మల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు