calender_icon.png 15 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపురెడ్డిపల్లిలో మహా పాడి పూజ

15-11-2025 12:33:46 AM

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ భ్రమరాంబ సమెత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురు స్వామి దోసపాటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణంతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. ఈ పడి పూజ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి సుమారు 1000 మంది అయ్యప్ప మాల ధరించిన స్వాములు వచ్చి భజనలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా  వందల సంఖ్యలో మహిళ భక్తులు కూడా ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.