కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుకు సిద్ధం
బీఆర్‌ఎస్ పిలుపు
నల్లగొండ టౌన్, ఆగస్టు 30: కాంగ్రెస్ వె య్యి రోజుల వైఫల్యాలను ఎండగట్టేందుకు బిఆర్‌ఎస్ కేడర్ ప్రజల్లోకి వెళ్లాలని బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం నల్లగొండలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసంలో నల్లగొండ నియోజకవర్గ స్థాయి స మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వ 1000 రో జుల విఫల పాలనపై రాష్ట్ర పార్టీ ఇచ్చిన పి లుపు మేరకు 8 రోజుల కార్యాచరణను ప్రకటించారు.
సెప్టెంబర్ 1 - ప్రెస్ మీట్, సెప్టెంబర్ 2 - నియోజకవర్గ కేంద్రంలో ధర్నా, బాకీ కార్డుల పంపిణీ, ఫ్లెక్సీ ప్రదర్శన, సెప్టెంబర్ 3 - రైతు సదస్సులు,సెప్టెంబర్ 4 - మహిళలు, వికలాంగుల వంటా వార్పు, సెప్టెంబర్ 5 - ఫీజు రీయింబర్స్ మెంట్, జాబ్ క్యాలెండర్ కోసం యూత్ ర్యాలీలు, సెప్టెంబర్ 7 - మం డల, జిల్లా ప్రజావాణిలో వినతి పత్రాలు, సెప్టెంబర్ 8 - అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించారుకాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, మూడేళ్లలో చేసిందేమీ లేదని, కేసీఆర్ ను తప్పుడు ప్రచారంతో బద్నాం చేస్తున్నార ని, వాస్తవాలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 3న మిర్యాలగూడకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని, నల్గొండ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కో రారు.జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రె డ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమో తు భాస్కరరావు లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కరీం పాషా, బొజ్జ వెంకటయ్య, తండు సైదులు గౌడ్, తు మ్మల లింగస్వామి, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, దేప వెంకటరెడ్డి తదితర కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






