31 August, 2026 | 1:34 AM

పేద ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

31-08-2026 12:00 AM

పారిశ్రామికవేత్త సంకినేని కృష్ణారావు

తుంగతుర్తి, ఆగస్టు 30 :సమాజంలో పేద ప్రజల పట్ల ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకొని, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సంకి నేని కృష్ణారావు అన్నారు. ఆదివారం మండ ల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో కీర్తిశేషులు సంకినేని కమలమ్మ సంకినే ని రామారావుల జ్ఞాపకార్థం, అక్షర ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు, తుంగతుర్తి లో పుట్టి, తుంగతుర్తి పాఠశాలలో చదివి, అంచలంచలుగా ఎదిగి, ఉన్న ఊరు ప్రజల పట్ల సేవ తలచి, ఎన్నో సేవా కార్యక్రమాలు,

లక్షల రూపాయలు వెచ్చించి కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి దావకాన సౌజన్యంతో ఇప్పటివరకు జిల్లాలో 3,000 పైచిలుకు పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు కొనసాగించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల అభీష్టం మేరకు కార్పొరేట్ వైద్యుల సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని తుంగతుర్తిలో ఏర్పా టు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని, ప్రజల ఆరోగ్యంగా ఉండాలని, కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో, జీవనోపాధి సాగించాలని ఆయన కోరుతూ, కులాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మండలంలో సుమారు 200 వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్తిగా కంటి సమస్యలు ఉన్న వారిని ఆపరేషన్కు రిఫర్ చేయనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ఉప సర్పంచ్ ఎలగందల శ్రీనివాస్ అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి, నాగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పాలవరపు సంతోష్, నాగరాజు, సైదులు గౌడ్ ,రమేష్, లింగయ్య, ఎల్లబోయిన బిక్షం శంకర హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.