08-12-2025 01:26:23 AM
- ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం
-రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం
-హౌసింగ్ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజా ఆమో దం సంపూర్ణంగా ఉందని కంటోన్మెం ట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం ఆయనను కలిసిన విలేక రులతో రెండేళ్ల పాలనపై ఇష్టాగోష్టిగా మా ట్లాడారు.
ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్థపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలోనే సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెం డేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నా డు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని తెలిపారు. సన్నబియ్యం, ఇందిర ఇండ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు.
ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని, వ్యవసాయ, పారి శ్రామిక రంగాల్లో గణనీ యమైన ప్రగతిని సాధిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రా న్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందు కు సాగుతోందన్నారు.
రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాలలో విప్లవాత్మక మార్పుల తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంతవరకు తగ్గించడం, అర్హులం దరికీ ఇం దిరమ్మ ఇండ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు.