08-12-2025 01:23:40 AM
-మారిందల్లా ఒక్కటే గులాబీ జెండా కనుమరుగై ‘హస్త’ వికాసం
-పదేళ్ల బీఆర్‌ఎస్.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
-భూములు అమ్మకపోతే సర్కార్‌కు పూట గడవని పరిస్థితి అంటూ ఎద్దేవా
-ఇచ్చిన మాట తప్పి.. ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు
-హామీల అమలుపై సీఎం చర్చకు రావాలని డిమాండ్
-కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు పోరాటం ఆగదు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
-అవినీతి, గన్ అండ్ డ్రగ్ కల్చర్‌లోతెలంగాణ రైజింగ్ : ఎంపీ లక్ష్మణ్
-బీజేపీ మహాధర్నాలో కాంగ్రెస్ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేసిన నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది.. పరిస్థితిలో ఏ మార్పు జరగ లేదు.. అదే దోపిడీ.. అదే అవినీతి.. నాడు కేసీఆర్ అండ్ సన్.. నేడు రేవంత్ అండ్ బ్రదర్స్.. మారిందల్లా ఒక్కటే గులాబీ జెండా కనుమరుగై.. హస్త వికాసం జరిగింది.. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రె స్, బీఆర్‌ఎస్ రెండూ అవినీతి, దోపిడీ, ప్రజలను మోసగించే పార్టీలంటూ మండిపడ్డారు. నాటి తరహాలోనే ప్రస్తుత సర్కా ర్‌కు కూడా భూములు అమ్మకుంటేపూట గడిచే పరిస్థితి లేదంటూ విమర్శించారు. ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారు.. ఇచ్చిన మాట తప్పి వేడుకలు జరుపుకోవడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆది వారం చేపట్టిన మహాధర్నాలో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్ రాంచందర్‌రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు మల్క కొముర య్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు, నాయ కులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టే చార్జ్‌షీట్‌ను బీజేపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
పదేళ్లు నియంత పాలన ..
‘మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్.. తన పదేండ్ల పాలనలో అప్పు ల రాష్ర్టంగా మార్చింది. బీఆర్‌ఎస్ పార్టీ నియంతలా తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలన రుద్దింది. అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడింది. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆకాంక్షలతో తెలంగాణలో ప్రజలంతా పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, ఆ తెలంగాణ కేసీఆర్? కుటుంబం చేతిలో ఎలా బందీ అయిపోయిందో మనం చూశాం. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ పాలన పట్ల విసిగి వేసారి పోయారు.
ఆ తర్వాత.. మార్పుతో వస్తున్నాం.. అనేక రకాల హామీలతో, అభయహస్తాలతో, గ్యారంటీలతో వస్తున్నం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. రెండు సంవత్సరాల విజయోత్సవ పాలన పేరుమీద రేవంత్ రెడ్డి రాష్ర్టమంతా పర్యటిస్తున్నడు.. అయితే సీఎం రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా. మీరు ఏ మొఖం పెట్టుకొని ఈ ఉత్సవాలు చేస్తున్నా రో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రశ్నిస్తున్నది. మీ రు ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని? అని నిలదీస్తున్నా.
సీఎం ఎంత సేపు రెండే ముచ్చట్లు చెప్తాడు.. ఒక్కటి ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం.. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చెప్తున్న.. రేవంత్ సర్కారు తాము ఇస్తున్నామని చెప్తు న్న ప్రతి కిలో సన్నబియ్యంకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.43 ఇస్తున్నది. రాష్ర్ట ప్రభుత్వం కేవలం రూ.13 మాత్రమే ఇస్తున్నది. కేసీఆర్ పోయి రేవంత్.. గులాబీ జెండా పోయి.. కాంగ్రెస్ జెండా వచ్చింది. పాలనలో మార్పు రాలేదు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు.
కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా వెలగబెట్టిన చరిత్ర ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. ఎందులో మార్పు వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలి. ఎట్లాంటి మార్పుతో తెలంగాణలో పాలన అందిస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇందిరా పార్క్ వేదికగా సీఎం చర్చకు సిద్ధమా..?
రైతులకు, నిరుద్యోగులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులకు, తెలంగాణ అమరవీరుల కుటుం బాలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా? ఏ విషయంలో మీరు ప్రజాపాలన చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి.
పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో సభలు పెట్టుకొని తిరగడం కాదు.. ఇచ్చిన హామీల అమలు మీద చర్చకు సిద్ధమా? అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన హామీలు ఈ రెండేండ్ల పాలనలో అమలు చేస్తే.. ఈ ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తావా?, మీ ప్రజాభవన్‌లో చర్చకు రావాలా? ప్రెస్ క్లబ్‌లో చర్చకు రావాలా?. పంటలపై బోనస్ ఇస్తానని మోసం చేశావు.
మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఏమైంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామ న్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు. కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటి పొడిచారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల సాయం చేస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయని కేం ద్రమంత్రి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ తరహాలోనే భూముల అమ్మకం
‘తన పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్ అమ్మకానికి పెట్టిందో.. ఈ రోజు కాంగ్రెస్ ప్రభు త్వం కూడా భూములు అమ్మకపోతే.. పూట గడవని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని దయనీయం, బీరు, బ్రాంది అమ్మకపోతే.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి.
మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఏమైంది రెండేండ్లు అయినా బెల్ట్ షాపులు ఎందుకు మూసివేయడం లేదు?. మద్యం అమ్మకాలతో లక్ష కోట్లకు పైగా ప్రజల నుంచి దోపిడీ చేయాలని ప్రభు త్వం చూస్తోంది. ఈ రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ పా ర్టీ పూర్తి వైఫల్యం చెందింది. గతంలో బీఆర్‌ఎస్ చేసినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది.
ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు అవినీతి, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కే పార్టీలే, అక్రమాలకు పెద్దపీట వేసే పార్టీలే. ఇచ్చిన హామీల అమలు ఏమైందని కాంగ్రెస్ పాలకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని’ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బీజేపీ వస్తే అర్బన్ నక్సలైట్లను అంతం చేస్తాం: రాంచందర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లఘచర్ల వంటి ప్రాంతాల్లో ఫార్మాసిటీ పేరిట రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరం- ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు ధారాదత్తం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కమీషన్ల ప్రభుత్వం.. కాంట్రాక్టర్ల ప్రభుత్వంగా చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది? ఇది తెలంగాణ రైజింగ్ కాదు...తెలంగాణ సింకింగ్ అన్నారు. హిందువులకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని ఎగతాళి చేసే కాంగ్రెస్ నాయకులకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు- ఈ ముగ్గురే దేవుళ్లు! అని మండిపడ్డారు.
అందుకే హిందువులను, దేవతలను రేవంతుద్దీన్ అవమానపరుస్తున్నారని విమర్శించారు. మరోవైపు గోసేవకులు, గోరక్షకులపై తుపాకీ కాల్పులు జరిగినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు కడతామంటూ మాట్లాడే వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిపోషిస్తోందన్నారు.
బాబ్రీ మసీదు ఇక్కడ కడతామని వాగుతున్న వారి ఘోరిని ఇక్కడ కడతామని హెచ్చరించారు. దేశంలో మోదీ ప్రభుత్వం మావోయిస్టులను అంతం చేస్తూ మావోయిస్ట్ ముక్త్ భారత్ వైపు తీసుకుపోతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రహదారుల విస్తరణ, బీబీనగర్ ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, హైదరాబాద్ ఏరోస్పేస్ రంగం అభివృద్ధి, పేదలకు ఉచిత బియ్యం - ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కేంద్రం చేసినవే అని వివరించారు.
కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసం హిల్ట్ పాలసీ తీసుకురావడమనేది అవినీతికి తెరదీయడమే విమర్శించారు. మూసీ బ్యూటిఫికేషన్ మీద మాకు వ్యతిరేకత లేదు, కానీ ఆ ప్రాజెక్టు డీపీఆర్ ఎక్కడ? ప్రజలకు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.
తప్పుదోవ పట్టించేందుకే గ్లోబల్ సమ్మిట్: లక్ష్మణ్
రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణకు సమాధానం చెప్పాలని, కుట్రలు, పన్నాగాలకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండేళ్లలో ఒక్క గ్యారంటీ అమలు చేయక పోవడమే, వంచించడమే మీ గ్యారంటీయా అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు తెలంగాణ రైసింగ్, గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.
గన్ కల్చర్‌లో, అవినీతిలో, డ్రగ్ కల్చర్‌లో తెలంగాణ రైజింగా? అని నిలదీశారు. వాటాల పంపకంలో మంత్రుల మధ్య విభేదాలు.. శాంతి భద్రతల సమస్య.. ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగిన మూలాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కుప్ప కూలి పోయిందని, తెలంగాణ సంపదను దోచి పెడుతూ, ఢిల్లీకి కప్పం కడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
అవినీతి, కుంభకోణాల మీదనే శ్రద్ధ: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్ ట్యాక్స్, ఆర్‌ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరిట కుంభకోణాలకు పాల్పడ్డారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాలుష్యం పేరుతో హిల్ట్ పాలసీ పేరుతో రూ.6.30 లక్షల కోట్ల కుంభకోణం చేసే యోచనలో ఈ ప్రభు త్వం ఉందని ఆరోపించారు.
అక్కడి నుంచి తరలిపోయే పరిశ్రమలకు ఎక్కడ స్థలాలు కేటాయిస్తారో చెప్పలేదన్నారు. ఇండస్ట్రీలో ఎన్ని గ్రీన్ జోన్‌లో ఉన్నాయో, ఎన్ని ఆరెం జ్ జోన్‌లో ఉన్నాయో, ఎన్ని రెడ్ జోన్‌లో ఉన్నాయో చెప్పాలన్నారు. మొన్నటికి మొ న్న సెంట్రల్ యూనివర్సిటీ భూ ములు కాజేయాలనీ చూ సారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీను సాక్ష్యాలతో రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసు కుంటానని సవాల్ విసిరారు.