వెయ్యి రోజుల పాలనతో కాంగ్రెస్‌కు చెరగని స్థానం
పెరిక కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు
మఠంపల్లి, సెప్టెంబర్ 3 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్(Congress) ప్రజా పాలన(People Governance) వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మఠంపల్లి మండల(Mathampally Mandal) కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్(Bhukya Manju Naik) ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు(Venkateswarlu) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనతో ప్రజల గుండెలో కాంగ్రెస్ పార్టీకీ చెరగని స్థానం అని,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రేషన్ కార్డులు,సన్న బియ్యం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు భరోసా, రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు,యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలతో ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
మాట ఇచ్చాం అమలు చేస్తున్నాం.. ప్రజలకు అండగా నిలుస్తున్నాం అంటూ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






