calender_icon.png 7 October, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించాలి

07-10-2025 01:04:48 AM

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదేం,ఎమ్మెల్యే పాయం

మణుగూరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : పేదలకోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమంను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికలలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలలో కాం గ్రెస్ పార్టీ విజయదుందిభిని మ్రోగించాలని, వందకు వంద సర్పంచ్లు, ఎంటిపిసి లు, జడ్పీటిసిలు, ఎంపిపిలు,  కైవసం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య పిలుపు నిచ్చారు. సోమవారం హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు.ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులందరూ కలిసి కట్టుగా అభ్యర్థుల గెలుపు కు కృషి చేయాలని మార్గనిర్దేశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్త లందరికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని, ఎవరు నిరుత్సాహం చెంద వద్దని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేదలకు న్యాయం చేసిందన్నారు. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పని చేసుకొని పరిష్కరించు కుందామని చెప్పారు.

అనంతరం ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్లు కల్పించా రన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాలను పట్టించు కోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలన్నారు. రానున్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటుందని అందరికీ తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. అనంతరం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీక రించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న , పీసీసీ కార్యదర్శి నాగ సీతారా ములు, మాజీ జెడ్పీ చైర్మన్ చందలింగయ్య దొర, డిసిసిబి డైరెక్టర్ తుల్లూరు బ్రహ్మయ్య, నియోజకవర్గానికి చెందిన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.