24-05-2025 01:21:29 AM
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, మే 23 ( విజయ క్రాంతి);రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొన్నం తో పాటు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అబ్జర్వర్ మక్సాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి అర్హులైన వారందరికీ అందే విధంగా గ్రామాల్లో ఉన్న ప్రతీ కార్యకర్త బాధ్యతతో చూడాలని ఆయన అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక విధానం పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కమిటీ సభ్యులు అధికారులు బాధ్యతతో అర్హులైన వారిని గుర్తించి అందించాలన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులమంతా కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని చెప్పి నియోజకవర్గానికి 1247 ఇండ్లు మంజూరు కాగా వాటిలో కేవలం 43 ఇండ్లకు మాత్రమే నిర్మాణాలు జరిగాయని ఆయన విమర్శించారు.
నియోజకవర్గంలో ఉన్న భీమదేవరపల్లి,ఎలుకతుర్తి, సైదాపూర్, కోహెడ మండలాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసే లేదని గత పాలకుల మాయ మాటలు తేలిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇల్లను మంజూరు చేయగా వివిధ మండలాలలో ఉన్న జనాభా నిష్పత్తి ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ళను బూతుల వారిగా కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా లబ్ధిదారుల ఖాతాలో మొదటి దశ నిధులు జమాయాయాన్ని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల ఆకాంక్ష దిశగా పాలన సాగిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులు కార్యకర్తలు ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరిస్తూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. గత నెల ఎలుకతుర్తి లో జరిగిన టిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన కెసిఆర్ మాట్లాడకపోవడాన్ని తన కూతురైన ఎమ్మెల్సీ కవిత నిలదీయడం జరిగిందని ఆయన అన్నారు.
టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు అంతర్గతంగా ఒకటే విధానముతో ఉన్నారని ఆ పార్టీ నాయకులే బహిర్గతం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చిట్టెంపల్లి ఐలయ్య, కొలుగూరిరాజు, చంద్రశేఖర్ గుప్తా, అశోక్ ముఖర్జీ, ఆదరి రవి, కోడూరి సరోజన, ఊస కోయిల ప్రకాష్, జక్కుల అనిల్, గజ్జల సురేష్, నగర బోయిన నాగరాజు, పూర్ణచందర్, చిదురాల స్వరూప, బొక్కల స్రవంతి,వివిధ గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.