calender_icon.png 24 May, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

24-05-2025 01:19:16 AM

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 

మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల అమలుతో పాటు, రైతులకు అవసరమైన ఇన్పుట్ సబ్సిడీలు, రాయితీపై విత్తనాలు అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు.

ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలు, వ్యవసాయ శాఖ సలహాలు సూచనలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలని రైతులను కోరారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాయితీపై పచ్చి రొట్ట  విత్తనాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఏడిఏ శ్రీనివాసరావు, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయ, ఏవో రాంజీ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంబాల ముసలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య ప్రవీణ్ నాయక్, ఏ ఈ ఓ లు తేజ, అఖిల్, రచన, సొసైటీ సీఈవో అనూష పాల్గొన్నారు.