17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

27-06-2025 08:42 PM

బోథ్,(విజయక్రాంతి): రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం 9,000 కోట్లు రైతు భరోసా ను రైతులకు అందించామని, అదేవిధంగా గత 10 ఏళ్లలో ఇల్లు రాకుండా ఎంతోమంది మోసపోయారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వేల సంఖ్యల్లో నేడు ఇందిరమ్మ ఇళ్ళను ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం కింద ఆర్థిక సహాయం అందిస్తామని, ఈ పథకాలన్నీ గడపగడపకు కాంగ్రెస్ నాయకులు చేరవేర్చాలని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో   గాజుల పోతన్న, రమేష్ బత్తుల, చెట్లపెళ్లి అనిల్,  పోశెట్టి, ఇస్రు పటేల్, కసిరె పోతన్న, రాము, శ్రీధర్, హరి సింగ్ , సుదీర్ , అజయ్, సత్యనారాయణ, అంకుష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.