24 August, 2026 | 10:30 PM

Breaking News

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •  

నాసిరెడ్డి సాంబశివరెడ్డి సేవలు మరువలేనివి: మంత్రి సీతక్క

27-06-2025 08:38 PM

పేద గిరిజన రైతులకు ఉచితంగా వరి విత్తనాలు ఇవ్వడం సంతోషకరం

వివేక రైతు సంఘం బలోపేతానికి కృషి చేస్తా: మంత్రి సీతక్క

మంగపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క(Women and Child Welfare Minister Seethakka) అన్నారు. శుక్రవారం మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో వివేకా ఎఫ్పిఓ వికాస్ అగ్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విత్తన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎంత చేసినా స్వచ్ఛంద సంస్థలు రైతు ఉత్పత్తిదారుల సహకారం సమాజానికి ఎంతో అవసరమని సీతక్క అన్నారు.

మేలైన విత్తనాలు వాడి రైతులు అధిక దిగుబడి సాదించాలని ఆకాంక్షించారు. గత దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగంలో విశేష సేవలు చేస్తున్న నాసిరెడ్డి సాంబశివరెడ్డి, పచ్చిపులుసు నరేష్ సేవలను మంత్రి కొనియాడారు నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి ఇరువై లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించగా మంత్రి సీతక్క శాలువాతో వారిని సన్మానించి అభినందించారు.