calender_icon.png 15 December, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభంజనం

13-12-2025 12:06:49 AM

  1. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో హస్తం గాలి

అన్నీ పంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు

పినపాకలో మరోసారి రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న పార్టీ

నాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. నేడు స్థానికంలో.. వారిదేపై చేయి

గట్టిపోటి ఇచ్చి గౌరవప్రదమైన సంఖ్యలో గెలుపొందిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్

చతికిలబడిన బీజేపీ, ఉనికిని చాటుకున్న వామపక్షాలు 

మణుగూరు, డిసెంబర్ 12(విజయక్రాంతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయింది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాం తాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఆ పార్టీ మరోసారి స్థానిక ఎన్నికలలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి ఆ పార్టీ సత్తాచాటింది.

స్థానిక ఎన్నికలలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. ఖమ్మం జిల్లాలో 192 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 గ్రామ పంచాయతీల్లో తొలి విడత గురువారం జరిగిన ఎన్నికలలో ఖమ్మం జిల్లా లో సుమారు 70 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 55 శాతం సర్పంచి స్థానాల్లో అధికార పార్టీ మ ద్దతుదారులు విజయం సాధించారు. గత శాసనసభ, లోక్ సభ ఎన్నికల పోల్చితే స్థాని క సంస్థల సంగ్రామంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కాసింత పట్టు పెంచుకోవటం విశేషం. స్థానిక ఎన్నికల ఫలితాలపై విజయక్రాంతి కథనం..

పినపాకలో కాంగ్రెస్ జోరు...

బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ ఆ రు గ్రామపంచాయతీలు, బీఆర్‌ఎస్ ఐదు గ్రామపంచాయతీలు కైవసం చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్వగ్రామ మైన మండలంలోని సమత్ భట్టుపల్లి సర్పంచ్ గా బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. ఇక్కడ 20ఏళ్ల నుంచి పోలెబోయిన తిరుపతయ్య కుటుంబానికే దక్కుతుండగా ఈసారి ఫలి తం తారుమారైంది.

ఆయనపై బీఆర్‌ఎస్ అ భ్యర్థి కొమరం సత్యనారాయణ 199 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేజర్ పంబాయతీ సమి తిసింగారంలో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు విజయం సాధించారు. రామానుజవరం పంచాయతీలో కాంగ్రెస్ బలవ ర్చిన సీపీఐ అభ్యర్థి బాడిశ కల్పన 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కూనవరం పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనిక శ్వేత గెలుపొందారు.

మండలంలో 14 పంచా యతీలలో కాంగ్రెస్ 10, సాధించగా బీఆ ర్‌ఎస్ రెండు స్థానలకు పరిమితమైంది. అశ్వాపురం మండలంలో 24 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పదహారు, బీఆర్‌ఎస్ ఎ నిమిది గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలలను గెలుచుకుంది. కరకగూడెం మండలం లో మొత్తం 16 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ 09, బీఆర్‌ఎస్ 06 స్థానాలు కైవ సం చేసుకోగా, కలవలనాగరంలో ఆదివాసీ స్వతంత్ర అభ్యర్థి కల్తీ విజయ్ కుమార్ 91 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పినపాక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బల పరిచిన అభ్యర్థులు సత్తా చాటారు.

23 పంచాయతీలకు 14 పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందగా, బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. దీంతో అధికార కాం గ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాకపై మరో సారి తన ఆధిపత్యాన్ని చాటారు.

గౌరవప్రదమైన స్థానంలో బీఆర్‌ఎస్

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తనకున్న బలమైన కేడర్ తో గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో కాంగ్రెస్ను గట్టిగానే ఎదుర్కొందని చెప్పవచ్చు. ఎన్నికల్లో ఆ పార్టీ బలప రిచిన అభ్యర్థులు ఇచ్చిన పోటీ అనేక చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా సాగడం గమనార్హం. అసెం బ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్‌ఎస్, పార్లమెంటు ఎన్నికల్లో జీరోకే పరి మితమైంది. 

అయినప్పటికి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ కేడర్ మాజీ ఎమ్మెల్యే 

రేగాకాంతారావు నాయకత్వంలో గ్రామా ల్లో తమ అస్తిత్వం కోసం మెరుగైన పోరా టం సాగించడంతో ఆ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సంఖ్యను దక్కించు కొని సర్పంచ్ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అభివృద్ధి, సంక్షేమం....

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నది. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ముఖ్యంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కలిసొచ్చాయని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వైపు మహిళలు మొగ్గుచూపినట్టు స్పష్టమవు తోందని చెప్తున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమన్వయంతో పార్టీ కేడర్ కలిసికట్టుగా పనిచేయడం వల్లే పార్టీకి స్థానిక ఎన్నికలలో ఈ స్థాయి విజయం దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.