మల్కాజిగిరిలో కాంగ్రెస్‌దే విజయం
03-05-2024 12:53 AM
టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల
ఎల్బీనగర్, మే 2: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి విజయం సాధిస్తారని టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా కాంగ్రెస్ నాయకులు నాగోలు, ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. నాగోల్ డివిజన్‌లోని అయ్యప్పకాలనీ, హనుమాన్‌నగర్, సహారా రోడ్‌లో ఇంటింటి ప్రచారంలో శ్రీనివాస్‌గుప్తా పాల్గొన్నారు. బీఎన్‌రెడ్డి లో మాజీ కార్పొరేటర్ లక్షీప్రసన్నారామ్మోహన్‌గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు. సునీతామహేందర్‌రెడ్డి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.




