17-02-2026 02:02:21 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం నిర్వహించిన తొమ్మిది మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు ఎన్నికల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే వివిధ కారణాలతో వాయిదా పడ్డ తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను మంగళవారం నిర్వహించగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను డ్రాలో గెలుచుకోగా, డోర్నకల్ మున్సిపాలిటీని పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ గెలుచుకుంది.
మంగళవారం జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక కోసం డ్రా నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి విజయం సాధించారు. అలాగే తొర్రూరులో నిర్వహించిన డ్రాలో తూణం శ్రవణ్ చైర్మన్ (కాంగ్రెస్) గా ఎన్నికయ్యారు. ఇక డోర్నకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కుండేటి రాజకుమారి చైర్ పర్సన్ గా, మాదా లావణ్య వైస్ చైర్ పర్సన్ (కాంగ్రెస్)గా ఎన్నికయ్యారు. అయితే జనగామ, తొర్రూర్ లో మాత్రం వైస్ చైర్మన్లుగా బీఆర్ఎస్ బలపరిచిన భూష పర్వతాలు, సోమ రజని డ్రాలో ఎన్నికయ్యారు.