24 August, 2026 | 11:32 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు

17-06-2026 09:26 AM

మంథని,జూన్17(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం జీలపల్లి(పర్లపల్లి) గ్రామానికి చెందిన పెండెల పవన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని మొతినగర్ సన్‌రిడ్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పవన్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా  శ్రీనుబాబు పవన్ యొక్క ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం, పవన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పవన్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో  పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.