17 June, 2026 | 10:42 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

17-06-2026 09:24 AM

బెజ్జూర్ జూన్ 17 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా నిర్వాహకులు  జనగామ లక్ష్మణ్, బొజ్జ కళావతి యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని బిపి,షుగర్, రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, టెన్షన్ నుండి ప్రశాంతత లభిస్తుంది. బిపి,షుగర్ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాల బలహీనత తదితర సమస్యలు సైతం కుదిరితపడతాయని తెలిపారు. ప్రతిరోజు ఆయుష్మాన్ భారత్ యోగ కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగ నిర్వహించడం జరుగుతుందని యోగ శిబిరాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. యోగ కేంద్రంలో ఉచితంగా యోగ పై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.