calender_icon.png 15 July, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ అయిన బిడ్డను తల్లికి అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది

15-07-2025 01:01:01 PM

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి జోగులాంబ గద్వాల జిల్లా వెళ్తున్న బస్సులోంచి తప్పిపోయిన బాలిక(తన్మయ్ శ్రీ)ను ఆర్టీసీ అధికారులు సురక్షితంగా తన తల్లికి అప్పగించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్(Jadcherla Bus Station)లో జరిగింది. జడ్చర్ల ఆర్టీసీ కానిస్టేబుల్ రాకేష్(Jadcherla RTC Constable Rakesh) అందించిన సమాచారం... హైదరాబాద్ నుంచి గద్వాల్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల బస్ స్టాండ్ లో ఆగింది. ఆ సమయంలో బస్ లోంచి పాప దిగిపోయింది. అనంతరం ఆ బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. బస్సు కొద్ది దూరం వెళ్లాక పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి డ్రైవర్ చెప్పడంతో అప్రమత్తం అయిన ఆయన బస్ ను మళ్లీ జడ్చర్ల డిపోకు తీసుకెళ్లారు. అప్పటికే పాప తప్పిపోయినట్లు గుర్తించిన ఆర్టీసీ కానిస్టేబుల్ రాకేష్, ట్రాఫిక్ గైడ్ వెంకటేష్ బాలిక పూర్తి సమాచారం తెలుసుకుని తన తల్లి శిరీష అప్పగించారు. తప్పిపోయిందనుకున్న తన కూతురు దొరకడంతో ఆ తల్లి ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి పాపను తీసుకుని వెళ్లిపోయింది. ఆదివారం నాడు ఊరు మర్చిపోయి తప్పిపోయిన 13 ఏళ్ల బాలికను కూడా జడ్చర్ల ఆర్టీసీ సిబ్బంది తమ కుటుంబసభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే.