15-07-2025 12:00:00 AM
కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పిలుపు
హుస్నాబాద్, జూలై 14: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని, తద్వారా అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగరేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సోమవారం రాత్రి ఆయన హుస్నాబాద్లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో జరిగిన చిగురుమామిడి మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారికి అండగా నిలవాలని సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.