15-07-2025 12:00:00 AM
తుర్కయంజాల్, జూలై 14:పచ్చదనం పెంపొందించడం అందరి బాధ్యత అని, మొ క్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయంజాల్లోని అయ్య ప్ప దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సత్తయ్య, మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డితో కలిసి స్థానికులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. నాటిన మొక్కను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ ఎఫ్‌ఎస్సీఎస్ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, నర్సింహ, అశోక్గౌడ్, పలుస శ్రవణ్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.