15-07-2025 12:01:07 AM
తెలంగాణ రోడ్లు, భవనాలు చీఫ్ ఇంజనీర్ బి. రైమల్
ఘట్ కేసర్, జూలై 14 : సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉంటాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రోడ్లు, భవనాలు చీఫ్ ఇంజనీర్ బి. రైమల్ అన్నారు. ఘట్ కేసర్ మునిసిపల్ ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీలో సోమవారం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక గెస్ట్ టాక్ నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి. రైమల్ హాజరై విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు.ఈసందర్భంగా రైమల్ సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అవకాశాలు, ప్రాజెక్టు నిర్వహణ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాముఖ్యత మరియు ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల ప్రాసెస్లపై విలువైన అంశాలను వివరించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయుక్తమైన సలహాలు, మార్గదర్శకాలు అందించారు.
కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాష్యప్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.