శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయంలో దేవుని పాదాల ప్రతిస్థాపన
రుద్రంగి ఆగష్టు 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని శ్రీ లక్ష్మినారసింహ స్వామి ఆలయంలో దేవుని పాదాల ప్రతిస్థాపన కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి దంపతులు స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రతిస్టపన కార్యక్రమన్నీ ప్రారంభించారు.
ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల షౌకర్యార్ధం ఆలయంలో స్వామివారి పాదాలను ప్రతిష్టించమని అన్నారు.భక్తులు స్వామి వారిని దర్శించుకొని పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు.అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు.భక్తులు స్వామి దర్శించుకొని కిందకి దిగడానికి మెట్ల మార్గం నుతనంగా నిర్మించినట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
తమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఇంకా ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.స్వామివారి పాదాలను అందజేసిన గుగ్గిళ్ల దేవయ్య - నందమ్మ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,ఆలయ కోశాధికారి ఈర్ణం నవీన్, సభ్యులు, గుగ్గిళ్ల తిరుపతి,పిట్టల జీవన్,రావణవేణి సందీప్ ,ఆకుల పెద్దన్న వెంకటి,గట్ల సాగర్,పిసరి శ్రీనివాస్,పరంకుశం అచ్చుత్,ఇప్ప మల్లేశం,నర్మద,గంగోత్రి, విజయ, నర్సయ్య,పాల్గొన్నారు.






