24 August, 2026 | 1:58 AM

మంథనిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం

24-08-2026 01:05 AM

మంథని, ఆగస్టు 23 (విజయక్రాంతి): విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు. జిల్లాలోని అన్ని మండలాలు, ప్రఖండాలు, గ్రామ స్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రజల్లో ధార్మిక, సామాజిక చైతన్యం పెంపొందించేలా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం, సహ కార్యదర్శి అడిగొప్పుల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రఖండ అధ్యక్షుడు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, మాదాడి నరేందర్ రెడ్డి, సత్సంగ్ ప్రముఖ్ కొమురవెల్లి హరీష్ గుప్తా, సహ కార్యదర్శులు గుండా శ్రీనివాస్, కజ్జం శ్యామ్, మందిర్ ప్రముఖ్ రాజమౌళి గౌడ్, గోరక్ష ప్రముఖ్ నూక శ్రీనివాస్, ప్రచార ప్రముఖ్ తూర్పటి రాము, సభ్యులు గాజుల సురేష్, మండల శివ, బండారి ప్రసాద్, కొమురవెల్లి తిరుపతి, సిల్వేరి రవీందర్, నిమ్మతి శ్రీనివాస్, వడ్లకొండ శ్రావణ్, మాచిడి శ్రీధర్ పాల్గొన్నారు.అలాగే మాతృశక్తి మంథని సంయోజక రావికంటి రేణుక, సహ సంయోజక కొత్త పుష్పలత, తోట సునీత, రాచర్ల తిరుమల, కుక్కడపు రాధా, దుర్గావాహిని జిల్లా సంయోజక తిరుమలతో పాటు భజరంగదళ్కు చెందిన అన్ని ప్రఖండాల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.