నాగోల్ డివిజన్‌లో చెరువుల సంరక్షణ
ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ అరుణసురేందర్‌యాదవ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలో చెరువుల సంరక్షణ, శుభ్రత కోసం ప్రత్యేక డ్రైవ్‌ను స్థానిక కార్పొరేటర్ చింతల అరుణసురేందర్‌యాదవ్ మంగళవారం ప్రారం భించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని నాగోలు చెరువు, ఫతులగూడ చెరువులలో చెరువుల సంరక్షణ, శుభ్రతలతో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చెరువుల్లో పేరుకున్న గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు తొల గించడం, చెరువుల చుట్టూ ఉన్న తుమ్మ మొ క్కలు తొలగించడం, అలాగే దోమల నివారణ చర్యలు చేపట్టడం కోసం ఈ పనులకు మొత్తం రూ.3.6 లక్షల వ్యయం కేటాయించారు.
ఈ సందర్భంగా చింతల అరుణ సురేందర్‌యాదవ్ మాట్లాడుతూ.. చెరువుల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, చెరువు అందాలను కాపాడటం మనందరి బాధ్యత. చెరువులు పరిశుభ్రంగా ఉంటే పరిసరాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాధవరెడ్డి, ఏఈ రవీందర్‌రెడ్డి, సూపర్వైజర్ జనార్ధన్, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




