8 June, 2026 | 10:46 PM

వివేకానంద స్కూల్‌లో మెగా హెల్త్ క్యాంప్

12-11-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీ వివేకానంద హైస్కూల్‌లో మంగళవారం మెగా హెల్త్ క్యాంపును లయన్స్ క్లబ్ అవంతిరెడ్డి, డాక్టర్ కావ్య ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డి అవంతిరెడ్డి మాజీ డైరెక్టర్ నీటిపారుదల శ్రీధర్‌బాబు, రేసు మల్లారెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, టి.రవీందర్‌రెడ్డిలకు శ్రీనివాస్‌రెడ్డి కరస్పాండెంట్ వివేకా నంద స్కూల్ పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించారు.

డాక్టర్ కావ్యచే వైద్య పరీక్షలు నిర్వహించారు. వై కిషన్‌రావు బాల నగర్ లయన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యం తో పి తేజశ్రీ అర్బజ్ ఖాన్ ఐ క్యాంపు నిర్వహించారు. ఇతర పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ గాదె శ్రీనివాస్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ హైదరాబాద్ స్టార్ట్ వాట్స్ వారికి లయన్స్ క్లబ్ జిల్లా 320 బి కార్యదక్షులు ధన్యవాదాలు తెలిపారు. వివేకానంద స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాయిస్ ఫాతిమా వందన సమర్పణ చేశారు.