13-11-2025 12:35:07 AM
-ఎన్‌ఐఏ విచారణలో విస్తుపోయే అంశాలు
-200 ఐఈడీ బాంబులు తయారు చేస్తున్న టెర్రర్ మాడ్యుల్ బృందం
-గణతంత్ర దినోత్సవ వేడుకలే ఉగ్ర ముఠా టార్గెట్
-రెండేళ్ల నుంచి దాడులకు సన్నాహలు చేస్తున్నాం: నిందితురాలు డాక్టర్ షాహిన్
-ఉగ్ర కుట్ర సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అరెస్ట్
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో తీగలాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీతోపాటు దేశవ్యాప్త వరుస పేలుళ్లకు ఉగ్రవాదు లు రెండేళ్ల నుంచే ప్లాన్ చేసినట్లు సమాచారం. జనవరి 26న దేశ రాజధానిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో బాంబ్ పేలుళ్లకు ముష్కరులు కుట్ర పన్నారు. ఫరీదాబాద్ మాడ్యూల్‌లో తుర్కి యే హ్యాండ్లర్లతో లింకులు సైతం బయటపడ్డాయి.
ఇప్పటికే అరెస్ట్ అయిన మహిళా డాక్టర్ షాహిన్ ఒకరికిచెందిన బ్రెజా కారు, ఢిల్లీ బాంబు దాడికి పాల్పడిన నిందితుడికి చెందిన రెండో కారు కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. మరోవైపు ఫరీదాబాద్ కుట్ర సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్‌తోపాటు ఉగ్ర కుట్ర వెనుక కారకులుగా భావిస్తున్న ఐదుగురు డాక్టర్లు అరెస్ట య్యారు. వీరింతా దేశ రాజధాని ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్ప డాలని వీరు కుట్ర పన్నుతున్నట్లు తలిపారు.
టెర్రర్ మాడ్యూల్‌పై ఇటీవల జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 200 ఐఈడీ బాంబులు తయారు చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతోపాటు మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థం ఉన్నట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. పేలుడు కేసును ప్రస్తుతం ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
దేశవ్యాప్త పేలుళ్లకు రెండేళ్ల నుంచి ప్లాన్
ఫరీదాబాద్‌లో ఉగ్రకుట్ర నిందితురాలు డాక్టర్ షాహిన్‌ను అధికారులు విచారించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చా యి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిపేందుకు దాదాపు రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తు న్నట్లు ఆమె పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ కోసం ఇది చేయాలనుకున్నట్లు పేర్కొంది. డాక్టర్ షాహిన్‌ను అరెస్టు చేసిన అధికారులు విచారణ కోసం శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. విచారణ సమయం లో ఆమె నుంచి కీలక విషయాలు రాబట్టారు. దేశంలో ఉగ్రదాడులు చేయడానికి ఉమర్ ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహిన్ తెలిపినట్లు సమాచారం.
డాక్టర్ ఉమర్ ముజమ్మిల్, ఆదిల్‌తో కలిసి దాదాపురెండేళ్ల నుంచి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతో జైషే ఉగ్రసంస్థ కోసం దేశవాప్తంగా డాడులకు సన్నా హాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఫీరాదాబాద్ మాడ్యూల్‌లో తనసోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమని పేర్కొంది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీ సులు మంగళవారం అతడినికూడా అదుపులోకి తీసుకు న్నారు. ఈ క్రమంలో గురుగ్రా మ్‌కు చెందిన అమ్మోనియం నైట్రేట్ సరఫరాదారుడిని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. జమాత్ ఉల్ మొమినాత్‌కు జైషే చీఫ్ మసూద్‌అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వస్తుంది. ఈ విభాగంలో షాహిన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆమెతో ఎలాంటి సంబంధాలూ లేవు: డాక్టర్ షాహిన్ మాజీ భర్త
‘మేము 2012 లో విడిపోయాం. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నాతోనే ఉన్నారు. నా పిల్లలు ఆమెతో మాట్లాడరు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మేము విడిపోయినప్పటి నుంచి నాకు ఆమెతో ఏ సంబంధమూ లేదు’ అని షాహీన్ సయీద్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ అన్నారు.
అరెస్టు సంగతి నాకు తెలియదు: డాక్టర్ షాహిన్ తండ్రి
‘షాహీన్ అరెస్టు నాకు తెలియదు. నా కూతురు ఉగ్రకుట్రలు చేస్తుందటే నమ్మలేకపోతున్నా’ అని ఆమె తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ ఐఏఎన్‌ఎస్ బృందంతో పేర్కొన్నారు. డాక్టర్ షాహీన్‌కు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ‘నా పెద్ద కొడుకు షోయబ్ నాతో నివసిస్తున్నాడు. రెండో కొడుకు షాహీన్ సయ్యద్ నిన్న అరెస్టు అయ్యాడు. నాచిన్న కొడుకు పర్వేజ్ అన్సారీ చాలాకాలం క్రితమే నగరం విడిచి వెళ్లిపోయాడు’ అని తెలిపాడు. ‘నేను చివరిసారిగా షాహీన్‌తో నెల క్రితం మాట్లాడా. కానీ నేను దాదాపు ప్రతి వారం జాఫర్‌తో మాట్లాడుతున్నా. షాహీన్ అరెస్టు గురించి నాకు తెలియదు’ అని చెప్పాడు.
కుట్ర సూత్రధారి ఇర్ఫాన్ అహ్మద్
ఫరీదాబాద్‌లో భద్రతాధికారుల ఆపరేషన్‌లో ఉగ్రకుట్రల్లో భాగమైన వారు వైద్యుల ని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనక ఉన్న ప్రదాన సూత్రధారుడు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అని అధికారులు గుర్తించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్‌ది జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతం. గతంలో అతడు శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగామ్‌లోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ నుంచి ప్రేరణపొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాదభావజాలాన్ని ఎక్కించినట్లు సమాచారం.
మాకు సంబంధం లేదు : అల ఫలాహ్ వర్సిటీ యాజమాన్యం
ఢిల్లీ పేలుడు ఘటనతో హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగింది. అక్కడి వైద్యులు కీలక అనుమానితులుగా మారారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఈ దురదృష్టకర పరిణామాలు తమను బాధించాయని, తమ సంస్థపై వస్తోన్న కథనాలను ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది.
ఆ కార్లు ఎక్కడ?
అరెస్టున మహిళా డాక్టర్లలో ఒకరికిచెందిన బ్రెజా కారు, ఢిల్లీ బాంబు దాడికి పాల్పడిన వ్యక్తికి చెందిన రెండో కారైన ఎకోస్పోర్ట్ డీఎల్10సీకే0458 కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. మరోవైపు ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ.. బ్లాస్ట్‌కు 10 రోజుల ముందే కొనుగోలు చేశాడని దర్యాప్తు వర్గాలు వెల్లడిం చాయి. అక్టోబర్ 29న కొరును కొన్న ఉమర్ వెంటనే కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాన్ని తీసుకున్నాడు. తర్వాత అతడు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాడు.
అప్పటి నుంచి కారు ఎక్కడ ఉందో తెలియడం లేదు. కానీ అల్ ఫలాహ్ వర్సిటీ వద్ద ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి భిన్నంగా ఫరీదాబాద్ పోలీసుల వాదన ఉంది. అలాగే ఉమర్ వాడిన రెండోకారు ఎకోస్పోర్ట్ డీఎల్10సీకే0458 కోసం పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రాజౌరి గార్డెన్ ఆర్టీఓలో ఉమర్ ఉన్ నబీకి 2017 నవంబర్ 22న రిజిస్టర్ చేసిన డీఎల్10 సీకే 0458 నంబర్ ఉన్న రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును గుర్తించడానికి పోలీసులు అన్ని రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లను తనిఖీ చేస్తున్నారు.
రిపబ్లిక్ డే నాడు పేలుళ్లకు కుట్ర
ఢిల్లీ పేలుడు కేసును దర్యాప్తు సం స్థలు ముమ్మరంగా విచారిస్తున్నా యి. పేలుడుకు ముందు దుండగులు అనేకసార్లు ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించి నట్లు, గణతంత్ర దినోత్సవం రోజున వారు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నాయి.పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్‌తో కలిసి తాను ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.