15 June, 2026 | 7:38 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధర ఢమాల్!

13-11-2025 12:10 AM
  1. కిలో ధర ఒక్క రూపాయి
  2. కన్నీరు పెడుతున్న రైతులు

భోపాల్, నవంబర్ 12: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి ధర అమాంతం పడిపోయింది. కిలో ఒక్క రూపాయికి పతనం కావడంతో అక్కడి ఉల్లి రైతులు కన్నీరు పెడు తున్నారు. ఇప్పటికే పాత నిల్వలు ఉండగా కొత్త పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడంతో ధరలు భారీగా పడిపోయాయి. దీం తో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు భారీగా నష్టం చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం అక్కడ కేజీ ఉల్లి ధర ఒక్క రూపాయి పలుకుతోంది.

మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో మంగళవారం కిలో రూ.2 ఉన్న ఉల్లి ధర బుధవారం రూపాయికి పడిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. పాత, కొత్త ఉల్లిపాయల నిల్వలు ఒకేసారి మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలోనే మాల్వాతో సహా పలు ప్రాంతాల్లో ఉల్లిధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా తమ ఉత్ప త్తులను నిల్వ చేసినప్పటికీ.. సరైన ధరలు లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఉల్లి, వెల్లుల్లికి కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.