ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం
-ఢిల్లీ పేలుడు ఘటన ముష్కరుల చర్యే
-కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్
-ప్రధాని మోదీ అధ్యక్షతనకేంద్ర క్యాబినెట్ సమావేశం
-మృతులకు సంతాపం
న్యూఢిల్లీ, నవంబర్12: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్రవాదుల పనేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బుధవారం ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర మంత్రిమండలి సమావేశం ఖండించింది. రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని క్యాబినెట్ పేర్కొంది.
ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. కాగా ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో క్యాబినేట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు, ఉగ్రవాద నిర్మూలనపై చర్చ జరిగింది. అలాగే కారు పేలుడు ఘటనలో తదు పరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు, దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రత జాగ్రత్తలు కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది.
క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు
ఎగుమతుల ప్రమోషన్ మిషన్ బలోపేతానికి రూ.25,060 కోట్ల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మం త్రి అశ్వనివైష్ణవ్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్ కింద రెండు పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్ ప్రోత్సాహన్, ని ర్యాత్ దిశ కొత్త పథకాలను కేంద్రం అమ లు చేయనుంది. ఎగుమతిదారులకు 100 శా తం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ౨౦ వేల కోట్ల అ మలుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిం ది. ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు క్యాబి నెట్ ఆమోదించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.




