1 May, 2026 | 11:30 PM

హైదరాబాద్‌పై జాతీయ పార్టీల కుట్ర

11-05-2024 12:49 AM

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు  

బీఆర్‌ఎస్ నేత సతీష్ రెడ్డి

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌పై జాతీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ నేతలు కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తామని  మాట్లాడుతున్నారని, తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తాము అనుకూలమని పేర్కొనడమే దీనికి నిదర్శమన్నారు.

హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని, కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటే తెలంగాణ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇదంతా సమైక్యవాదులు, ఆంధ్రా పెత్తందారులతో కలిసి రెండు జాతీయ పార్టీలు చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. ఇందులో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.