2 May, 2026 | 12:48 AM

ఓటు హక్కు వినియోగించుకోవాలి

11-05-2024 12:50 AM

డా.హిప్నో పద్మాకమలాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి) : ఓటు హక్కు ఉన్న వారందరూ ఓటు వేయాలని, మేధావులు మౌనం వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మాకమలాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్‌లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. కూరగాయలను ఏరి మరీ కొంటామని, మంచి నాయకుడిని జాగ్రత్తగా ఎన్నుకొని ఓటు వేయాలని సూచించారు. పోలింగ్ రోజు సెలవు ఇచ్చినప్పటికీ 50 శాతం మంది ఓటు వేయకపోవడం బాధాకరమని అన్నారు.  సమావేశంలో యోగా గురువు సరోజిని రామారావు, శోభారాణి, పూర్ణకుమారి, జీ. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.