calender_icon.png 1 October, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం

01-10-2025 01:46:55 AM

  1. పండగల ముందు అభ్యర్థులకు ఖర్చు భయం
  2. కాంగ్రేస్, బిఆర్‌ఎస్ లలో వర్గ పోరు
  3. బీజెపీ లో సైతం తీవ్ర పోటీ కాంగ్రేస్ పార్టీకి ప్రెస్టేజ్ సవాల్
  4. ఆప్యాయత పలకరింపులు కుల సమీకరణలపై దృష్టి 

తలకొండపల్లి, సెప్టెంబర్ 30: స్థానిక సంస్థల షెడ్యూల్ రావడంతో  పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ ల పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. అప్పటి నుండి పంచాయతీ కార్యదర్శుల ఆద్వర్యంలోనే పాలన కొనసాగుతుంది. దీంతో గ్రామాలలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడంతో పాలన ఆటకె క్కింది.

స్థానిక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఎట్టకేలకు ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో ప్రజ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆశావహు ల్లో సైతం పోటికి సై అంటున్నారు.  ఎంపిటిసి ఎన్నికలు రెండు దశలలో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశలలో అక్టోబర్ 09 నుండి నవంబర్ 11వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 02న దసరా, 21న దీపావళి రెండు పండుగలు ఎన్నికల సమయంలో వస్తున్నాయి.

ఖర్చు విషయంలో పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులో పండుగుల సమయంలో ఎన్నికలు రావడంతో పోటీదారు లలో భయం నెలకొనగా, ప్రజలు మాత్రం సంతోషంలో ఉన్నారు.మరో పక్క ఎక్కువ శాతం సీట్లు రిజర్వేషన్ కోటా కింద ప్రకటించడంతో పోటీ చేయాలనుకున్న ఇతరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పోటీకి అవకాశం వస్తే తప్పకుండా బరిలో నిలిచి పదవిలో కూర్చోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిజర్వే షన్లు తమకు అనుకూలంగా రాకపోవడంతో వారి ఆశలన్నీ అడిఆశలయ్యయి. వారందరు అక్టోబర్ 08వ తేదీన హైకోర్టు వెలువరించే తీర్పు పైన ఆశలు పెట్టుకున్నారు.

అభ్యర్థుల మధ్య తీవ్ర పోటి..

ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో జడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాలలో పోటీ చేసే కాంగ్రేస్, బిఆర్‌ఎస్, బీజెపీ పార్టీలలో అభ్యర్థుల మద్య తీవ్ర పోటి నెలకొంది. కల్వకుర్తి నియోజకవర్గం  ఆమనగల్ బ్లాక్ పరిధి లో నాలుగు మండలాలు  ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు ఉన్నాయి. ఇవి రంగారెడ్డి జిల్లా పరిదిలోకి వస్తాయి. బ్లాక్ మండలాలలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బిఆర్‌ఎస్, బిజెపి బలంగానే వున్నాయి.

ఆమనగల్ మండలం జడ్పీటీసీ, ఎంపీపీ రెండు జనరల్ కాగా, తలకొండపల్లి జడ్పీటీసీ బిసి జనరల్, ఎంపీపీ ఎస్టీ జనరల్, మాడ్గుల జడ్పీటీసీ బీసీ జనరల్, ఎంపీపీ జనరల్, కడ్తాల్ జడ్పీటీసీ బీసీ మహిళ, ఎంపీపీ జనరల్ మహిళలకు కేటాయించారు. ఆమనగల్ మండలం నుండి జడ్పీటీసీ అభ్యర్థులుగా కాంగ్రేస్ నుండి జక్కు అనంతరెడ్డి మాజీ వైస్ ఎంపిపి(మంగళపల్లి), రమణారెడ్డి మాజీ సర్పంచ్ (చెన్నంపల్లి), మంగ్లి రాములునాయక్ (శంకరకొండ తాండ), సత్యం (శెట్టిపల్లి), మంగమ్మ నిట్టనారాయణ మాజీ వైస్ ఏపీపీ (గౌరారం), బిఆర్‌ఎస్ నుండి అర్జున్ రావ్(శెట్టిపల్లి), మాజీ జడ్పీటీసీ పత్యనాయక్,

ఉప్పల వెంకటేశ్ మాజీ జడ్పీటీసీ తలకొండపల్లి, బీజెపీ నుండి విష్ణువర్ధన్ రెడ్డి (మంగళపల్లి), కండె హరిప్రసాద్ మాజీ జడ్పీటీసీ (ఆమనగల్), సింగం శ్రీను(ఆకుతోటపల్లి), తలకొండపల్లి కాంగ్రేస్ నుండి జడ్పీటీసీ గా గుజ్జుల మహేష్(చీపునుంతల), రవీందర్ యాదవ్ (తలకొండపల్లి), బిఆర్‌ఎస్ నుండి మాజీ ఎంపిపి సిఎల్ శ్రీనివాస్ యాదవ్ (వెల్జాల్), మాజీ ఎంపిపి నిర్మల (జంగారెడ్డిపల్లి), మాజీ జడ్పీటీసీ పద్మ నరసింహా(తలకొండపల్లి), బీజెపీ నుండి జడ్పీటీసీ గా మాజీ సర్పంచ్ బక్కి కుమార్ (చంద్రధన), మాజీ సర్పంచ్ శ్రీనివాసాచారి (రాంపూర్), పద్మ అనిల్,

శానమోని పాండు (తలకొండపల్లి), కడ్తాల్ కాంగ్రేస్ నుండి జడ్పీటీసీగా శ్రీనివాస్ గౌడ (మైసిగండి), మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్(ఎక్వాయిపల్లి), కుటుంభాల మద్య పోటి ఉంది.బీజెపీ నుండి మాజీ ఎంపిపి వీరయ్య (కర్కల్ పహడ్), మాడ్గుల నుండి జడ్పీటీసీగా కాంగ్రేస్ నుండి వెంకటేశ్వర్లగౌడ్ (సుద్దపల్లి), బిఆర్‌ఎస్ నుండి మాజీ సర్పంచ్ జంగయ్యగౌడ్ (మాడ్గుల) పోటి పడుతున్నారు.

వీరే కాకుండా మరికొందరు ఆశావాహులు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకు సమీకరణలు మారుతుంటాయి. పోటీకి ఆశావాహులు ఎక్కువ మంది ఉండడంతో ఆదినాయకులకు అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. కాంగ్రేస్, బిఆర్‌ఎస్‌లలో వర్గ పొర్లు ఉన్నాయి. బీజెపీలో సైతం పోటి తీవ్రంగా ఉంది. నాలుగు మండలాలలో ముడు పార్టీల బలంగానే ఉన్నాయి.