calender_icon.png 9 November, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ బలవన్మరణం

09-11-2025 01:21:25 AM

  1. ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్యం
  2. మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో ఘటన

ఉప్పల్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో మరో కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్న  శ్రీకాంత్(42) 2009 సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 23 నుంచి విధులు హాజరుకాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ అధికారులు విధులకు హాజరుకావాలని నోటీసులు సైతం జారీ చేశారు.

అయితే కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శ్రీకాంత్ మనస్థాపానికి గురై శనివారం తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఆర్థిక ఇబ్బందులా లేదంటే వేరే ఏదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.