calender_icon.png 9 November, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులకు రూ. 60,799 కోట్లు

09-11-2025 01:22:44 AM

  1. ప్రతిపాదనలో మరో రూ.28వేల కోట్ల పనులు
  2. రహదారుల నిర్మాణంతో బహుళ జాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ 
  3. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది యువతకు ఉపాధి
  4. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ అభివృద్ధి, జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా ఒకేసారి రూ. 60,799 కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు రోడు,్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో రూ.28వేల కోట్లతో చేపట్టనున్న మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు, ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు.

శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందని తెలిపారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లోకి  పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయని వివరించారు.

ఎనిమిది లేన్లుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

అబ్దుల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్కు నుంచి విజయవాడ వరకు ఉన్న హైదరాబా ద్-----విజయవాడ జాతీయ రహదారిని 8 లేన్లుగా విస్తరించనున్నామని వెల్లడించారు. ఇందులో ఆరు లైన్లు ప్రధాన రహదారి కాగా రెండు సర్వీసు రోడ్ల నిర్మాణం జరుగుతుందని, రహదారి వెంట ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రోడ్డు ప్రమాదాలు నివారించడ మే లక్ష్యంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

తెలంగాణరాష్ర్ట గతిని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆ ర్)  నిర్మాణానికి రూ. 36,000 కోట్లు కేటాయించినట్లు తెలి పారు. ఆరు లేన్లుగా నిర్మించబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు అన్ని జిల్లాలను  కలుపుతుందని వివరించారు. ఈ రహదారి నిర్మాణానికి 50 శాతం నిధులను రాష్ర్ట ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. హ్యామ్ ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్లతో కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు.

ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. వీటితో పాటుగా అదనంగా మరో రూ. 28 వేల కోట్లతో చేపట్టనున్న పనులు ప్రతిపాదనలో ఉన్నాయని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. 8,000 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుది దశకు చేరాయని, దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే.

20 వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ర్ట ముఖచిత్రమే మారుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.