calender_icon.png 9 July, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం పోలీసులు

09-07-2025 12:38:18 AM

- బాధితులకు న్యాయం చేస్తారనే నమ్మకం పోలీసులు కల్పించాలి

- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 

పెద్దపల్లి, జూలై 08(విజయ క్రాంతి); పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సిపి అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ పోలీస్ అధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు.

ఈ తనిఖీల్లో సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ముఖ్య మైన ప్రదేశాలు, ఈ ప్రాంతం లోని మావోయిస్టుల, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 24*7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటూ సత్వర న్యాయం న్యాయం చేస్తారనే నమ్మకాన్ని, భరోసా కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించి, ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు స్పందించాలసిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు.చివరగా పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్‌ఐ వెంకటేష్ ఉన్నారు.