calender_icon.png 9 July, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు

09-07-2025 12:38:25 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఈ.వి.ఎం.ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఈ వి ఎం గోదామ వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

24 గంటలు సి. సి. కెమెరాలు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గోదాములోని అన్ని రిజిస్టర్లు, భద్రత ప్రమాణాలను సమీక్షించారు. అలాగే ప్రజల సౌకర్యం కోసం ప్రతిరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.

మంగళవారం  కలెక్టరేట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో గల జి- 3లో ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ను జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో నెలకొన్న వర్ష పరిస్థితుల దృష్ట్యా  కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు.