28-10-2025 12:00:00 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఘట్ కేసర్ పోలీసులు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి ఆధ్వర్యంలో ఘట్ కేసర్ పట్టణంలోని బస్ టర్మినల్ నుండి శివారెడ్డిగూడ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ బాలస్వామి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివన్నారు.
పగలు, రాత్రి లేకుండా సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతత్వ ధోరణిలో సంఘ విద్రోహ శక్తులు హింసలను పాల్పడుతున్నాయని ఇలాంటి శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీస్ సోదరులు వీరమరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.