calender_icon.png 6 May, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని కాపాడాలి

09-04-2025 05:32:09 PM

దౌల్తాబాద్: రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట, సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు.

భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారులాలు, నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మల్లారెడ్డి, ఆది వేణుగోపాల్, స్వామి, కనకయ్య, ప్రవీణ్, సంపత్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, ఎల్లయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు.