17 April, 2026 | 10:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

09-04-2025 05:44 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మునగాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అండర్పాస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. గ్యాస్ బండపై పెంచిన 50 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ధరలు తగ్గించేంతవరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామన్నారు.

వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం వలన ప్రస్తుతం ఉన్న 876 నుండి 905 రూపాయలకు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అధికభారాలు పడతాయన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిలు వెంకన్న గడ్డం వినోద్ బోళ్ళ మంగారెడ్డి ఉప్పల పిచ్చమ్మ లవంగి గోపాలం తదితరులు పాల్గొన్నారు.