20 August, 2026 | 2:53 AM

కుషాయిగూడ, రాధిక ఎక్స్‌రోడ్స్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించండి

20-08-2026 12:00 AM

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కుషాయిగూడ ఎక్స్ రోడ్స్, రాధికా ఎక్స్ రోడ్స్ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ ప్రాంతాలు ఈసీఐఎల్, కీసర, నాగా రం తదితర ప్రాంతాలకు ప్రధాన అనుసంధాన కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు.

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య అధికమ వడంతో ఈ రెండు కూడళ్ళ వద్ద ప్రతిరోజు తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంటుందన్నారు. ట్రా ఫిక్ రద్దీ కారణంగా రోడ్డు ప్రమాదాల అవకాశాలు కూడా అధికమవుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కుషాయిగూడ ఎక్స్ రోడ్స్ వద్ద ఒక ఫ్లైఓవర్, రాధి కా ఎక్స్ రోడ్స్ వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు అవసరమైన సాంకేతిక పరిశీలనలు చేపట్టి, ప్రాజెక్టులకు తక్షణమే పరిపాలనా అనుమతులు నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.