24-04-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : ఆలయాల నిర్మాణాలకి ప్రభుత్వ నిధులు ఖర్చు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాత్రమే సాధ్యమైందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సనాతనం గా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను భావి తరాలకు తెలియచేస్తూ సన్మార్గంలో నడవాలని సూచించారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల ను బుధవారం ఘనంగా జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా రు. జోగు రామన్న ఆలయ అభివృద్ధికి రూ. 5 లక్షల సహాయం అందించడంతో గ్రామస్తులు ధన్యవాదాలు తెలియచేశారు.
శ్రీ గ్రామానికి చెందిన రేణుకా ఎల్ల మ్మ నాట్య మండలి ప్రతినిధులు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించి, ఆలయ నిర్మాణం కోసం విరాళాలను సేకరించగా, ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నాయకులు గండ్రత్ రమేష్, శ్రీనివాస్, కొండ గణేష్ దమ్మపాల్, సతీష్, కుమ్రా రాజు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.