13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

08-01-2026 12:27 AM

రాజన్న సిరిసిల్ల, జనవరి 7 (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి ఐఎంఎస్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ. ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి ఐఎంఎస్ భవన నిర్మాణ పనులను బుధవారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణ ప్లాన్ లను పరిశీలించారు.

గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి కాగా, గోడల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అన్ని గదులు పరిశీలించి.ఎప్పటిలోగా పూర్తి అవుతాయో ఆరా తీశారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భవన పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచి మార్చి 08వ తేదీలోగా పూర్తి చేయాలని ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డిని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో  జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఈ సతీష్ తదితరులు ఉన్నారు.