8 April, 2026 | 4:12 AM

నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టాలి

08-04-2026 12:41 AM
  1. రూ.1.20 కోట్ల నిధులతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్,ఏప్రిల్ 7(విజయక్రాంతి): నందనవనం కాలనీలో నాలా రిటర్నింగ్ వాల్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ నందన వనం కాలనిలో రూ.1.20 కోట్ల వ్యయంతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,  మాజీ కార్పొరేటర్  పద్మ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు.

సుమారు రూ.1కోటి 20 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులు శాంతినగర్ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు కొనసాగనున్నాయని తెలిపారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీలో వరద నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, స్థానిక ప్రజలకు పెద్ద ఉపశమనం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిహెచ్. చంద్రమోహన్, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కాలనీవాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు.