ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ
08-04-2026 12:41 AM
భిక్కనూర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా. యెమిమా ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొని ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు సందేశాలు అందించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ వేంకట రమణ ,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




