బోధన్ మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్లకు 35 పోటీదారులు
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మునిసిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగియున్న కో ఆప్షన్ సభ్యులు ఇద్దరు సభ్యులను అందలో ఒకరు మహిళా సభ్యులుగాఉండాలి, అలాగే అల్ప సంఖ్యాక వర్గలకు చెందిన ఇద్దరు సభ్యులను అందులో ఒకరు మహిళా సభ్యులు ఉండాలి. తెలంగాణ మునిసిపాలిటీస్ కో-ఆప్షన్ - 2020 (G.O.Ms.No. 57, 07 మే నుండి 13 మే సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు తీసుకున్నారు.
బోధన్ మునిసిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిఉన్న కో-ఆప్షన్ సభ్యల ఎన్నికలో పాల్గొనుటకు మగ వారి నుండిదరఖాస్తులు 06 ఆడవారి నుండి దరఖాస్తులు 03 మొత్తం దరఖాస్తుల సంఖ్య 09 దరఖాస్తుల వచ్చాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అల్ప సంఖ్యాకుల వర్గాల నుండి చెందిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొనుటకు మగ వారి దరఖాస్తులు 17 ఆడవారి దరఖాస్తులు 09 మొత్తం దరఖాస్తుల సంఖ్య 26 దరఖాస్తులు వచ్చినవని తెలియజేశారు. బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.






