calender_icon.png 3 December, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల కోసం పోటెత్తిన పోటీదారులు

03-12-2025 12:26:12 AM

  1. రెండవ విడత నామినేషన్లు ముగిశాయి

బెజ్జూర్ సెంటర్లో బారులు తీరిన ఆశావహులు

బెజ్జూర్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కోసం జరుగుతున్న నామినేషన్ల పర్వం రెండవ విడతలో భాగంగా మంగళవారం రాత్రికి ముగిసింది. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రా ల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఆయా సెంటర్లు సందడిగా మారాయి.

ఈ సందర్భంగా, బెజ్జూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఆశావహులు క్యూలైన్లో బారులు తీరారు. బెజ్జూర్, పెద్ద సిద్దాపూర్, పాపన్న పేట్, తల యి గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు  వారి మద్దతుదారులు కేంద్రం ముందు పెద్ద ఎత్తున గుమి గూడటంతో, అక్కడ ఎన్నికల వాతావరణం కనిపించింది. స్థానిక పాలన పీఠాన్ని అధిరోహించడానికి జరుగుతున్న .

ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో, చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేయాలనుకున్నవారు క్యూ కట్టారు. నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతా వరణంలో ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీసు సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించి, నామినేషన్ సెంటర్ల వద్ద భద్రతను పర్యవేక్షించారు.

అభ్యర్థుల వెంట వచ్చిన మద్దతుదారులు ఒకేసారి సెంటర్‌లో పలికి రాకుండా క్రమశిక్షణతో క్యూలో ఉంచి నామినేషన్లను స్వీకరించారు.చివరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలు సమయం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దీంతో రెండవ విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.