calender_icon.png 3 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

03-12-2025 12:25:35 AM

-సీఎం దిష్టి బొమ్మలను దహనం చేయండి

-పార్టీ శ్రేణులకు  బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పిలుపు

-హిందువులంతా ఏకం కావాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని నిరసిస్తూ బుధవా రం నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.  

తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమ యం ఆసన్నమైందని, హిందువుల శక్తి ఏంటో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హిందువుల దేవుళ్లపై అవహేళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఎంఐఎం సహవాస దోషం వల్లే హిందువులపై, దేవీదేవతలపై బరితెగించి మా ట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఓట్ల తో అధికార పీఠమెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారో, ఆ ఓట్లతోనే సీఎం, కాంగ్రెస్ పార్టీ కు పట్టిన మైకాన్ని వదిలించి అధికార పీఠం నుంచి దించేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

హిందూ సమాజం ఆలోచించాలి

 కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువు లను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ము మ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని, ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ము స్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం వ్యాఖ్యలపై మంగళవా రం బండి సంజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 

రేవంత్ రెడ్డి.. హిందూ వ్యతిరేకి

హిందూ దేవుళ్లను తూలనాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..  హిందూ వ్యతిరేకి అనేది ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. దేవతలను, దేవుళ్లను అవమానకర వ్యాఖ్యలు చేస్తూ నోటికి వచ్చినట్లు దూషించిన రేవంత్ హిందువుల మనోభావాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిస్సిగ్గుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేవుళ్లపైన ఇష్టానుసారంగా వర్ణిస్తూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని యావత్తు సమాజానికి ఏవగింపు కలిగిందన్నారు. రేవంత్ హిందూ సమాజానికి భేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.