calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుళ్ల విషయంలోనే ఏకాభిప్రాయం లేదు

03-12-2025 12:27:25 AM

-ఇంత మంది ఉన్న కాంగ్రెస్‌లో..ఎలా ఉంటుంది?

-సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో  కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేవుళ్ల మీదనే మనకు ఏకాభిప్రాయం లేనప్పుడు.. పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుందన్నారు.

హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని.. పెళ్లికాని వారు హనుమంతుడిని, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుడిని, కొంతమంది శివమాల, ఇంకొం తమంది అయ్యప్పమాల వేస్తారని పేర్కొన్నారు. మందుతాగేవాళ్లకు, పప్పన్నం తినేవాళ్లకు, మాంసం తినేవాళ్లకు కూడా దేవుళ్ల మీద ఏకాభిప్రాయం ఉండదన్నారు.

తమ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్లు ఉన్నారని, వీరందరికీ ఏకాభిప్రాయమే ఉండాలంటే ఎలా కుదురుతుందని సీఎం అన్నారు.  పదవులు, పార్టీ కార్యక్రమాలు విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి పై విధంగా స్పందించారు.